Anirudh Ravichander | ఇప్పటికిప్పుడు దక్షిణాదిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున వినిపించే పేరు అనిరుధ్ రవిచంద్రన్. ఈ మధ్య అనిరుధ్ జోరు మాములుగా లేదు. బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ సినిమాలకు కంపోజర్‌గా పనిచేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ప్రస్తుతం అనిరుధ్ చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో అన్ని పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక సంగీత దర్శకుడిగా ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నాడో.. పలువురు సెలబ్రెటీలతో రిలేషన్లో ఉన్నట్లు విమర్శలు కూడా తెచ్చుకున్నాడు.
గతంలో అనిరుధ్, నటి ఆండ్రియాతో డీప్ లిప్ కిస్ పెట్టుకున్న ఫోటో లీకై తమిళనాట సెన్షేషన్ అయింది. అంతేకాదు అనురిధ్ చాలా మందితో ఎఫైర్స్ పెట్టుకున్నాడని అప్పట్లో తమిళ మీడియా కోడై కూసింది. ఆ తర్వాత తనపై కొంచెం కొంచెంగా విమర్శలు తగ్గాయి. తన మ్యూజిక్‌తో విమర్శించిన వారే తనను పొగిడేలా చేసుకున్నాడు. అయితే తాజాగా మళ్లీ తనపై డేటింగ్ వార్తలు వస్తున్నాయి. స్టార్ సింగర్ జోనితా గాంధీతో అనిరుధ్ డీప్‌లో లవ్‌లో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్. అయితే ఇప్పటివరకు దీనిపై ఈ జంట స్పందించలేదు.
అనిరుధ్ ప్రస్తుతం తెలుగులో దేవర, విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమాలు చేస్తున్నాడు. ఇక జోనితా హలమితి హబీబో, మ మ మహేషా, మెంటల్ మదిలో, ఓ మై గాడ్ వంటి చార్ట్ బస్టర్ పాటలను పాడింది.