Devara | మరో 5 గంటల్లో దేవర సందడి షూరు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే థియేటర్లన్ని ఆలయాల్లాగా ముస్తాబయ్యాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ అనగానే అందరూ మరోసారి జనతా గ్యారేజ్ రేంజ్లో ఊహించుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు అనిరుధ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు కొరటాల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
అనిరుధ్ ఏ సినిమాకు సంగీతం అందించిన ఆ సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాడు అంటా. దేవర సినిమాకు కూడా పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ చేసిన అనంతరం నాకు కాల్ చేసి శివ గారు గుర్తుపెట్టుకొండి మనం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అన్నాడు. ఇక చాల్లే ఆపయ్య అంటే. లేదు శివ గారు ఇది పక్కా బ్లాక్ బస్టర్ చూస్తు ఉండండి అంటూ అనిరుధ్ చెప్పాడు. ఎన్టీఆర్, నేను కూడా ఈ సినిమాపై అంతా నమ్మకంగా లేము కానీ అనిరుధ్ నమ్మాడు అంటూ కొరటాల చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.
తనకు సినిమా నచ్చితే ఏదో tweet పెడతాడంట ట్విట్టర్లో @anirudhofficial చెప్పాడు !! ఈ సినిమాని అందరికంటే ఎక్కువ నమ్మింది తనే
ఇక చాల్లే ఆపయ్య అంటే !! ~ #KoratalaSiva
లేదు శివ గారు BlockBuster కొడుతున్నాంమీరు అలా నవ్వుతూ ఉండండి చాలు వీ నవ్వంటే మాకు చాలా ఇష్టం శివ గారు #Devara https://t.co/1YWYk7ohsE pic.twitter.com/gCndsgNx98
— Team Koratala (@TeamKoratala) September 25, 2024