Kavya Maran | సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) అధినేత్రి కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ డేటింగ్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకురుస్తూ.. ఈ జంట తాజాగా హాలీవుడ్ మీడియాకు చిక్కింది. ఇటీవల అనిరుధ్‌తో పాటు కావ్య మారన్ కలిసి న్యూయార్క్ వీధిలో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక యూకే వ్లాగర్ అనుకోకుండా ఈ వీడియో తీయడంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Anirudh 🏃🏼♂️ Kavya 😒 pic.twitter.com/ReDivVpuPb
— Nymeria Proxy Assit (@Proxyassit) November 13, 2025