అనిరుధ్, హెబ్బాపటేల్ జంటగా రూపొందుతున్న యాక్షన్ ప్యాక్డ్ ైస్టెలిష్ ఎంటైర్టెనర్ ‘మారియో’. ‘ఎ టర్బో చార్జ్డ్ ర్యాంప్ రైడ్’ అనేది ఉపశీర్షిక. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ జీ గోగణ దర్శకుడు. దసరా పర్వదినం సందర్భంగా ఈ సినిమా పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీకి అద్దం పట్టేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. హెబ్బా పటేల్ ఎరుపురంగు దుస్తుల్లో డైనమిక్‌గా కనిపిస్తుంటే, అనిరుధ్ రైఫిల్ పట్టుకొని హై ఓల్టేజ్ లుక్‌లో దర్శనమిస్తున్నారు. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించే చిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి రచన: రాకేందు మౌళి, కెమెరా: ఎం.ఎన్.రెడ్డి, సంగీతం: సాయికార్తీక్, రాకేందు మౌళి.