Mahesh babu | ‘యానిమల్’ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసింది : మహేశ్ బాబు
Animal Pre Release Event | బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం 'యానిమల్' (Animal). కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నాడు.
Animal Pre Release Event | బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’ (Animal). కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించారు. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ నటుడు మహేశ్‌బాబు, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్లో భాగంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ.. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మెంటలొచ్చిందని ఇలాంటి ఒరిజినల్ ట్రైలర్ నేనైతే ఎప్పుడూ చూడలేదని మహేష్ తెలిపాడు. ఇక రణ్‌బీర్ గురించి మాట్లాడుతూ.. నేను రణ్‌బీర్‌కి చాలా పెద్ద ఫ్యాన్ ని. ఇంతకుముందు కూడా ఈ విషయం చాలా సార్లు చెప్పాను. కానీ అప్పుడు రణ్‌బీర్ సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ చెబుతున్న నేను రణ్‌బీర్‌కి చాలా చాలా పెద్ద ఫ్యాన్ ని అంటూ మహేష్ అన్నాడు. ఇక దర్శకుడు సందీప్ గురించి మాట్లాడుతూ.. సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. సందీప్ దేశంలోనే ఒరిజినల్ ఫిలిం మేకర్లలో ఒకరు అంటూ కొనియాడారు.
“Trailer chusthe Mental Ochesindhi”
Superstar #MaheshBabu about #Animal Movie Trailer.#AnimalPreReleaseEvent #ShreyasMedia pic.twitter.com/uHEKT0qP6v
— Shreyas Media (@shreyasgroup) November 27, 2023
ఇక యానిమల్ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

