Animal Movie | బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’ (Animal). అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 01న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ సినిమా 22 రోజులకు రూ.862 కోట్ల మార్కును దాటేసింది. అయితే ఈ మూవీలోని పాటలు ఎంత బిగ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్ ఎంట్రీ సాంగ్, బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్‌లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ క్లైమాక్స్ సాంగ్ ‘సారి దునియా జలా దెంగే’ (Saari Duniya Jalaa Denge) సాంగ్ ఎక్స్టెండెడ్ వెర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ చూస్తే.. మూవీలో ఉన్న సాంగ్‌కు ఈ సాంగ్‌కు తేడా ఉన్నట్లు తెలుస్తుంది. మూవీలో ఈ సాంగ్ రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్ ఫైట్ సీక్వెన్స్‌లో రాగా.. ఈ ఎక్స్టెండెడ్ కట్లో మేకర్స్ కొత్త వెర్షన్‌ను విడుదల చేశారు.