Animal Movie | బాలీవుడ్లో ప్రస్తుతం ‘యానిమల్’ (Animal) సినిమా హవా నడుస్తుంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ సినిమా 13 రోజులకు రూ.772 కోట్ల మార్కును దాటేసింది. అయితే ఈ మూవీలోని పాటలు ఎంత బిగ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్ ఎంట్రీ సాంగ్, బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్‌లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.
అయితే ఈ సాంగ్స్ పాపులర్ అవ్వడంతో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలను చిత్రబృందం ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. ఇప్పటికే ఆ సినిమా నుంచి అబ్రార్ (బాబీ డియోల్) ఎంట్రీ సాంగ్ విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా రణ్ విజయ్ సింగ్ (రణ్‌బీర్ కపూర్) ఎంట్రీ సాంగ్ విడుదల చేశారు. రోజా మూవీలోని క్లాసిక్స్‌ను తీసుకుని ఈ మెడ్లీని క్రియేట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇక ఈ చిత్రంలో రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.