Animal Movie | ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’ (Animal). బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కేవలం అయిదు రోజుల్లోనే రూ.482 కోట్ల మార్కును దాటేసింది. స్టోరీ, సాంగ్స్, యాక్షన్స్ సీన్స్ ఇలా సినిమాలోని అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో ఉన్న భవనం అందరి దృష్టిని ఆకర్షించింది. రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్ ఈ సినిమాలో ఒక విలసవంతమైన భవనంలో నివసిస్తారు అయితే ఈ భవనం ఎవరిదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇది షూటింగ్ సెట్టా లేకుంటే నిజమైనదేనా అని ఆరా తీస్తున్నారు. అయితే ఈ బిల్డింగ్ ఎవరిదని తెలిసిందంటే..?
పటౌడీ ఏకైక వారసుడు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ భవనానికి అసలైన యజమాని. ఈ భవనం సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. దీని విలువ సుమారు రూ. 800 కోట్ల మేర ఉంటుందని అంచనా. ఇక ఇందులో 150 గదులు, ఏడు పడకలు ఉన్నాయి. గతంలో నవాబ్ ఇఫ్తికార్ ఖాన్, ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నవాబ్ మొహమ్మద్ మన్సూర్ అలీ ఖాన్ ఆధీనంలో ఉన్న ఈ ప్యాలెస్ ఇప్పుడు సైఫ్‌కు సొంతమైంది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో సైఫ్ ఇందులో నివసిస్తున్నారు.
He is the Box Office #Animal🔥🪓#AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalInCinemasNow #AnimalTheFilm #AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/nAwA2uUvaF
— Animal The Film (@AnimalTheFilm) December 6, 2023