‘అర్జున్‌రెడ్డి’ వంటి కల్ట్మూవీని అందించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. రణబీర్‌కపూర్, అనిల్‌కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇటీవల గీతాంజలి పాత్రలో రష్మిక మందన్న ఫస్ట్‌లుక్ అందరిని ఆకట్టుకుంది. గురువారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. పవర్ఫుల్ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎమోషన్ అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తండ్రీకొడుకుల సంఘర్షణ ప్రధానాంశంగా టీజర్ ఆకట్టుకుంది.
‘నేను చెడును వెంటాడుతూ వెళ్లాను..నాకు ఎక్కడా కనపడలేదు. నాలో నేను చూసుకున్నాను. నా కన్నా చెడ్డవాడు లేడు’ అంటూ హీరో రణబీర్‌కపూర్ చెప్పిన సంభాషణ కథలో భావోద్వేగాలకు అద్దంపట్టేలా ఉంది. సాధారణ యువకుడు రెబల్‌గా మారిన వైనాన్ని టీజర్లో చూపించారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తనదైన మార్క్‌తో టీజర్‌ను ప్రజెంట్ చేశాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.