ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ‘స్పిరిట్’ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలేర్పడ్డాయి. జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ సినిమాలో కథానాయికగా ఎవరూ నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు అగ్ర కథానాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా దీపికా పడుకోన్ పేరు ప్రముఖంగా వినిపించింది.
అయితే ఆమె భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేయడంతో పాటు షూటింగ్ పరంగా కొన్ని కండీషన్స్ పెట్టడంతో మేకర్స్ వద్దనుకున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రిని కథానాయికగా ప్రకటించారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకుంది త్రిప్తి దిమ్రి. ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ చిత్రంతో త్రిప్తి దిమ్రికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. తాజాగా ‘స్పిరిట్’లో ఛాన్స్ దక్కించుకొని అందరిని ఆశ్చర్యపరచింది.