MEGA 157 | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). వీటిలో ఒకటి మెగా 157. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. సెకండ్ షెడ్యూల్ పూర్తయ్యే దశలో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట రౌండప్ చేస్తోంది. ఇందులో చిరంజీవి పాత్ర పేరేంటో చెప్పేశాడు అనిల్ రావిపూడి.
ఈ చిత్రంలో శంకర వరప్రసాద్‌గా చిరంజీవి కనిపిస్తారని ఓ టెలివిజన్ షోలో క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. దీంతో మరి అనిల్ రావిపూడి శంకర వరప్రసాద్‌గా చిరంజీవి క్యారెక్టరైజేషన్‌ను ఎలా డిజైన్ చేశాడోనని మూవీ లవర్స్, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా.. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చిరంజీవి బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తోన్న విశ్వంభర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో త్రిష ఫీమే లీడ్ రోల్లో నటిస్తోంది.
Rahul Sipligunj | ఆస్కార్ విన్నర్ ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడేంటి… సైలెంట్‌గా ఆమెతో నిశ్చితార్థం
Mega Heroes| రెండేళ్లలో మెగా హీరోలు 8 ఫ్లాపులు ఇచ్చారా.. బన్నీ ఒక్కడే నిలబడ్డాడు..!
Newyork India Day Parade | పరేడ్‌లో జంటగా కనిపించిన విజయ్ దేవరకొండ- రష్మిక.. వీడియో వైరల్