టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ ఫుల్ స్పీడ్ మీదున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ .. హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడితో కలిసి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందించనున్నాడు. అయితే ఇప్పటివరకు అనీల్ రావిపూడి కామెడి ప్రధానంగా సినిమాలు తెరకెక్కించాడు. మరి బాలయ్యతో ఎలాంటి సినిమా చేస్తాడని చర్చ నడుస్తుంది.
పటాస్ సమయంలోనే బాలయ్యకు ‘రామారావు గారు’ అనే కథను వినిపించాడట అనిల్. ఆ సమయంలో ఈ కథపై ఆసక్తి చూపని బాలయ్య ఇప్పుడు ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం కామెడీ యాక్షన్ జానర్లో నడుస్తుందని కొందరు అంటుంటే మరి కొందరు మస్ యాంగిల్లో ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.