Anil Ravipudi | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫుల్ ఫ్యామిలీ – కామెడీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎక్స్టెండెడ్ క్యామియో పాత్ర మరింత హైలైట్ కానుందని తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. ఓ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిల్ రావిపూడి, వెంకటేష్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, కేవలం గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే కాకుండా 20 నిమిషాలపాటు ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్టైన్ చేస్తాడని స్పష్టంచేశారు.
ఇటీవల వెంకటేష్ ఒక పాట షూట్ కూడా పూర్తి చేశారు. వెంకీ ఎంట్రీతో సినిమా హాస్యభరిత వాతావరణం మరింత పెరిగేలా ఉన్నట్లు తెలుస్తోంది. “క్లైమాక్స్‌లో చిరంజీవి–వెంకటేష్ కలిసి కనిపించే సీన్స్ అభిమానులను పండుగలా ఫీల్ కలిగిస్తాయి అంటూ సినిమాపై ఆసక్తి కలిగించారు. ఇద్దరు స్టార్లు కలిసి కనిపించడం చాలా అరుదుగా జరిగే విషయం కావడంతో, ఈ కాంబినేషన్ స్క్రీన్‌పై సూపర్ ఎనర్జీ క్రియేట్ చేయనుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ పూర్తిస్థాయి కామెడీ సినిమాతో వస్తున్నందుకు చిరంజీవి కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.“మన శంకర వరప్రసాద్ గారు పూర్తిస్థాయి ఎంటర్టైనర్. ప్రేక్షకులు ఖచ్చితంగా ప్రేమిస్తారు” అంటూ ఇటీవలే మెగాస్టార్ తెలిపారు.
చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్, సెట్స్, కామెడీ ట్రీట్మెంట్ అన్ని పక్కాగా ఉండేలా భారీ బడ్జెట్‌తో చిత్రీకరిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. మీసాల పిల్ల పాట యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా విడుదలైన పాట కూడా ఆకట్టుకుంటుంది. మొత్తానికి, “మన శంకర వరప్రసాద్ గారు”లో చిరు–వెంకీ కాంబినేషన్, అనిల్ రావిపూడి కామెడీ టచ్ భారీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిపై ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.