చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాలో విక్టరీ వెంకటేశ్ అతిధి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర నిడివి ఎంత ఉంటుంది? కథలో ఈ పాత్ర ప్రాముఖ్యతేంటి? సినిమాకు ఈ పాత్ర ఎంత వరకు హెల్ప్ అవుతుంది? ఇవన్నీ ప్రతి ఒక్కరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలు. వీటికి దర్శకుడు అనిల్ రావిపూడి రీసెంట్గా సమాధానమిచ్చారు.
ఈ సినిమాలో వెంకటేశ్ పాత్ర ఇంట్రస్టింగ్‌గా ఉంటుందట. పైగా ఆయన సినిమాలో దాదాపు 20 నిమిషాలు కనిపిస్తారని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఇంకా చెబుతూ ‘వెంకటేశ్ భాగం కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌కి ఆసక్తి రెట్టింపయ్యింది. ఇందులో ఆయన పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా ైక్లెమాక్స్ సీన్స్‌లో చిరంజీవితో కలిసి ఆయన చేసే హంగామాకు థియేటర్లలో నవ్వుల వర్షం పక్కా.’ అని తెలిపారు.