రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్నెస్ ది రియల్ క్రైమ్’ ఉపశీర్షిక. రామకృష్ణ వట్టికూటి దర్శకుడు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. కాల్‌మనీ నేపథ్యంలో చోటుచేసుకునే ఆసక్తికరమైన సంఘటనలతో టీజర్ ఉత్కంఠగా సాగింది.
నిజజీవిత ఘటనల స్ఫూర్తితో ఈ కథ తయారుచేశామని దర్శకుడు తెలిపారు. జెమినీ సురేష్, గోవింద్శ్రీనివాస్, కిరణ్ మేడసాని, శివరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వెంకీ వీణ, నిర్మాతలు: మల్లిఖార్జున ఎలికా, అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల, దర్శకత్వం: రామచంద్ర వట్టికూటి.