‘కరుప్పు’ విజయంతో మంచి జోష్ మీదున్నారు తమిళ అగ్ర హీరో సూర్య. ప్రపంచవ్యాప్తంగా మూడొందల కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టి సూర్య కెరీర్లోనే భారీ విజయంగా ‘కరుప్పు’ నిలిచిన విషయం విదితమే. సూర్య 46వ సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్ట్ 14న విడుదల కానున్నది. ఆ తర్వాత జీతూ మాధవన్ దర్శకత్వంలో తన 47వ సినిమా చేస్తారు సూర్య. ‘జైభీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో 48వ సినిమా. పా.రంజిత్‌తో 49వ సినిమా చేయనున్నట్టు తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి.
ఇక మిగిలింది 50వ సినిమా. ఈ ల్యాండ్ మార్క్ మూవీ విషయంలో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నది. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సూర్య 50వ సినిమా చేయనున్నట్టు వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబోకి సంబంధించిన చర్చలు చివరి దశకు చేరాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నదని సమాచారం.