విశాల్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మకుటం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థకిది 99వ సినిమా కావడం విశేషం. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో విశాల్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించారు. యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్ ప్రధానాకర్షణగా నిలిచాయి.
సముద్ర నేపథ్యంలో జరిగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని, స్నేహం…ప్రతీకారం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని, విశాల్ త్రిపాత్రాభినయం హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, కథ: రవి అరసు, నిర్మాత: ఆర్.బి.చౌదరి, దర్శకత్వం: విశాల్.