కొత్తగా తొమ్మిది సీవోఈలు.. డిగ్రీ కళాశాలలకు యూజీసీ పేసేల్ అమలు
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో కొ త్తగా తొమ్మిది సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లను ఏర్పాటుచేయాలని నిర్ణయించా రు. అంతేకాకుండా సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బందికి యూజీసీ పేస్కేల్‌ను అమలు చేయనున్నారు. ఇందుకు సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్(బీజీ) ఆమోదం తెలిపింది.
- ఎస్సీ గురుకుల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆమోదం
హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో కొ త్తగా తొమ్మిది సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లను ఏర్పాటుచేయాలని నిర్ణయించా రు. అంతేకాకుండా సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బందికి యూజీసీ పేస్కేల్‌ను అమలు చేయనున్నారు. ఇందుకు సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్(బీజీ) ఆమోదం తెలిపింది. సచివాలయంలో గురుకుల సొసైటీ చైర్మన్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నేతృత్వంలో గురువారం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం జరిగింది. మొత్తంగా 26 అంశాలపై బోర్డు చర్చించింది. అందులో పలు అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ విద్య, ఉపాధ్యాయ సంక్షేమం, ఉన్నత విద్య అవకాశాల విస్తరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను ఆమోదించినట్టు వెల్లడించారు. బోర్డు నిర్ణయాలను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్ నేతలు రామలక్ష్మణ్, కీర్తి రవితోపాటు పలు యూనియన్ నేతలు స్వాగతించారు. సమావేశంలో బోర్డు సభ్యులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్ దోత్రే, ప్రొఫెసర్ కాశీం, సొసైటీ కార్యదర్శి శారద, ఎస్టీ గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి, టీజీఆర్ ఈఐఎస్ కార్యదర్శి ఉషారాణి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అభిలాష అభినవ్, ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్‌సింగ్, ఓఎస్ డీవైజే విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బోర్డు తీసుకున్న నిర్ణయాలు..
- డిగ్రీ కళాశాలల నిర్వహణకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఏర్పాటుచేయాలి. అధ్యాపకులకు యూజీసీ వేతన సేల్ అమలు చేయడంతోపాటు న్యాక్ గుర్తింపు సాధనకు ప్రత్యేక కమిటీని నియమించాలి.
- ఉన్నత విద్య కోసం విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సాయం అందించాలి.
- 9వ తరగతి నుంచే నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు 9 సీవోఈలను ప్రారంభించాలి.
- క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్లను టీజీటీలుగా గుర్తించాలి.
- రాష్ట్రంలో భర్తీ చేసే పోస్టులకు రోస్టర్ విధానం అమలు చేయాలి.
- డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోర్సులను ప్రవేశపెట్టాలి. హైదరాబాద్‌లో సొసైటీ ఆధ్వర్యంలో ఫార్మసీ కళాశాల స్థాపన.
- క్రీడలు, వృత్తి విద్య అభివృద్ధికి స్పోర్ట్స్ కోచ్‌లు, వొకేషనల్ లెక్చరర్ల సేవలు కొనసాగించడం.
- డిగ్రీ విద్యార్థుల్లో విద్య ఏకాగ్రత పెంపునకు మొబైల్ వినియోగంపై అమలులో ఉన్న నిబంధనల కొనసాగింపు.
- అన్ని గురుకులాల్లో ఉమ్మడి మెనూ విధానాన్ని అమలుచేయాలి.
- పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల పారితోషికాల పెంపు.
- 133 విద్యాసంస్థలకు సొంత భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రితో చర్చించాలని నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

