Animal Movie | ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాపై సినీ లవర్స్‌లో ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. బార్డర్లు పెట్టుకున్న టాలీవుడ్‌కే అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి.. అసలు బార్డర్లు లేని బాలీవుడ్లో యానిమల్తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని అందరిలోనూ తిరుగులేని అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రీ టీజర్ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక రౌడీ గ్రూప్‌ను గొడ్డలితో నరుకుతూ రక్తపాతం సృష్టించిన తీరు ఇప్పటికీ రణ్‌బీర్ ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ప్రీ టీజరే ఈ లెవల్లో ఉంటే టీజర్ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అని అప్పుడే విజువలైజేషన్ చేసుకుంటున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అనీల్ కపూర్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఒంటిమీద గాయాలతో వయసు మీద పడినట్లున్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనీల్ కపూర్ బల్బీర్ సింగ్‌గా కనిపించబోతున్నాడు. సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ గురించి సినీ లవర్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తు్ంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రణ్‌బీర్ కు ఫాదర్ గా కనిపించనున్నాడు. ఇటీవలే రణ్‌బీర్ కపూర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీకై నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అందులో క్లీన్ షేవ్ తో ఉన్న రణ్‌బీర్ లుక్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది.
రివేంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఇన్సైడ్ టాక్. కాగా ముందుగా ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా.. వీఎఫ్ఎక్స్ కారణంగా డిసెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఎలాగో రిలీజ్‌కింకా టైమ్ ఉంది కనుక ఎడిటింగ్ రూమ్‌లో ఎక్కువ కసరత్తులే చేస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ANIL KAPOOR: ‘ANIMAL’ TEASER DROPS ON 28 SEPT… #AnilKapoor as #BalbirSingh… Stars #RanbirKapoor… Directed by #SandeepReddyVanga, #Animal arrives in *cinemas* on 1 Dec 2023.#BhushanKumar #MuradKhetani #AnimalTeaserOn28thSept#AnimalOn1stDec#AnimalTheFilm pic.twitter.com/YX7FHrGjuJ
— taran adarsh (@taran_adarsh) September 21, 2023