Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్(Daaku Maharaaj) సినిమాకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఉదయం నాలుగు గంటల నుంచి బెనిఫిట్ షోలకు అనుమతినిస్తూ.. ప్రీమియర్ షో టికెట్ ధరలను రూ.500(జీఎస్టీతో కలిపి)గా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే విడుదలైన మొదటిరోజు నుంచి జనవరి 25 వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. ఈ షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సంక్రాంతి బరిలో ఉన్న గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపునకు అనుమతినివ్వగా తాజాగా ఈ లిస్ట్‌లో డాకు మహరాజ్ కూడా చేరింది.
డాకు మహరాజ్ సినిమా విషయానికి వస్తే.. 2023లో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Andhra Pradesh GO for #DaakuMaharaj Ticket Hikes
Benefit Show – Rs500(Including GST)
Multiplex – Rs135
Single Screens – Rs110 #DaakuMaharaajOnJan12th pic.twitter.com/p8rji3Dicp— Telugu Chitraalu (@TeluguChitraalu) January 4, 2025