Andhra King Taluka | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానుల ఆనందానికి అవధుల్లేవు! ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ‘U/A’ సర్టిఫికెట్ అందుకోవడమే కాక, బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలుగా లాక్ చేశారు. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రధానంగా మెప్పించిన అంశాలు ఇవి
భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ: హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ అద్భుతంగా పండింది. వివేక్-మెర్విన్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు అతిపెద్ద బలం. హీరో-తండ్రి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు కోర్ స్ట్రెంగ్త్గా నిలిచాయి. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన పాత్ర (సూర్య కుమార్) హైలైట్గా, కీలక మలుపులకు దారి తీస్తుందని టాక్. పల్లెటూరి వాతావరణం, అలాగే దేవాలయానికి సంబంధించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా తెరకెక్కించారట. అలాగే చివరి 45 నిమిషాల భావోద్వేగ ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. మొత్తం మీద, రామ్ పోతినేని ఖాతాలో నవంబర్ 27న ఒక ఖచ్చితమైన బ్లాక్బస్టర్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.
It is a U/A for #AndhraKingTaluka ❤🔥
A film for all, a film relatable to all 💥GRAND RELEASE WORLDWIDE ON NOVEMBER 27th.
BOOKINGS NOW OPEN!
🎟️ https://t.co/LKMkGbt7jv#AKTonNOV27
Energetic star @ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/PlAdBO6p3w— Mythri Movie Makers (@MythriOfficial) November 25, 2025