స్వీయ దర్శకత్వంలో ఇంద్రాణి దవులూరి నటిస్తున్న చిత్రం ‘అందెల రవమిది’. నాట్యమార్గం ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు హరీశ్‌శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇంద్రాణి కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. వారు అమెరికాలో ఉంటూ మన కళలు, సంస్కృతి మీద గౌరవంతో పిల్లలకు క్లాసికల్ డ్యాన్సులు నేర్పిస్తుంటారు. మన సంస్కృతి ఔన్నత్యాన్ని తెలియజెప్పే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీయడం అభినందనీయం’ అన్నారు.
ఇంద్రాణి దవులూరి మాట్లాడుతూ ‘రెండువేల ఏళ్ల నాటి కళ భరతనాట్యంను బ్రతికించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మన కళల విలువ తెలియజెప్పాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో మా సినిమాకు ప్రశంసలు దక్కాయి’ అని చెప్పారు. తనికెళ్ల భరణి, ఆదిత్యమీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, నిర్మాత, దర్శకత్వం: ఇంద్రాణి దవులూరి.