Anchor | ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్‌లో ఈ అమ్మడి పేరు తప్పక ఉంటుంది. ఈమెకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షోతో కూడా ఈ అమ్మడు మంచి పేరు తెచ్చుకుంది.ఇక సోషల్ మీడియాలో ఘాటు అందాలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంటుంది. ఇప్పుడు ఈ అమ్మడి ఓల్డ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ కాగా, ఈ పిక్ చూసి అందరు కంగు తింటున్నారు. ఇప్పటికీ అప్పటికీ పోలీకే లేదు అంటున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా.. మరెవరో కాదు లౌడ్ స్పీకర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి. ఈ అమ్మడు తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉంటుంది. అయితే కెరీర్ తొలినాళ్లలో చాలా బొద్దుగా ఉండేది. ఆ తర్వాత డైట్, వెయిట్ కంట్రోల్ కోసం కసరత్తులు చేసి క్యూట్‌గా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న శ్రీముఖి పాత ఫొటోలు చూసి అందరు షాక్ అవుతున్నారు. మే 10న యాంకర్ శ్రీముఖి పుట్టినరోజు కావడంతో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. మే 11న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా,ఇందులో శ్రీముఖి పాత ఫొటోలని స్క్రీన్‌పై చూపించి షాకిచ్చారు. మీరు చిన్నప్పుడు దిగిన ఫొటోలని మేము కొన్ని కలెక్ట్ చేశాం. అప్పుడు మీ ఎంజ్ ఎంతో గెస్ చేయాలి అని అవినాష్ అన్నాడు. ఇక శ్రీముఖి చిన్ననాటి ఫొటోలు బోర్డ్‌పై చూపించారు. అప్పుడు హరి.. ఇది మీ క్యూటెస్ట్ ఫొటో.. చూస్తుంటే నాకే మీ దగ్గరకి వచ్చి ముద్దు పెట్టాలని అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు శ్రీముఖి.. హే వీడేంట్రా ముద్దంటున్నాడు అంటూ శ్రీముఖి కాస్త ఓవర్ చేయగా, వెంటనే రోహిణి ఓ పంచ్ వేసింది. దానికెందుకే షాకవుతావ్.. వాడు ముద్దంటే నువ్వు వద్దను అంటూ రోహిణి కౌంటర్ వేసింది.
ఆ తర్వాత కనిపించే ఈ క్యూట్ నెస్ వెనక కనబడని ఫోటోస్ ఉన్నాయ్ అంటూ స్క్రీన్ పై కొన్ని ఫోటోస్ చూపించాడు హరి. అందులో శ్రీముఖి బొద్దుగా గుర్తుపట్టనట్టు ఉంది. పిక్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. దాని గురించి మాట్లాడుతూ.. అది నా 10వ తరగతి ఫొటో.. ఆ సమయంలో ఒక్కసారి కూర్చుంటే మినిమమ్ రెండు బిర్యానీ ప్యాకెట్లు అయిపోవాలంతే.. తినితిని 108 కిలోలు అయిపోయి ఇలా నడవలేక నడిచేదాన్ని అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది. అంత లావు ఉండే శ్రీముఖి ఇప్పుడు ఇంత స్లిమ్‌గా క్యూట్‌గా మారడం కోసం చాలానే కష్టపడి ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న చాలా మందికి శ్రీముఖి ప్రేరణగా నిలుస్తుందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకి స్టార్ మాలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది..