Anchor| టాలీవుడ్ బుల్లితెరపై సత్తాచాటిన యాంకర్లు చాలా మందే ఉన్నారు. అయితే వారిలో కొందరు అభిమానులకి చాలా దగ్గరయ్యారు. అందులో బబ్లీ బ్యూటి శిల్పా చక్రవర్తి ఒకరు. హైదరాబాద్‌కు చెందిన శిల్పా పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించి మెప్పించింది. నువ్వే నువ్వే లాంటి సినిమాల్లో కూడా కనిపించి ఆకట్టుకుంది. కాగా శిల్పాది బెంగాళీ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో వారి కుటుంబం ఇక్కడే స్థిరపడింది. ఇక షోలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతోనూ సందడి చేసింది శిల్పా చక్రవర్తి. ఒకప్పుడు సుమకి కూడా పోటీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం సైలెంట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 3లో కనిపించి సందడి చేసింది.
అయితే శిల్పా చక్రవర్తి రీసెంట్గా ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో 7 ఏళ్లుగా తాను ఎన్ని బాధలు పడిందో వివరించింది. పిల్లలు పుట్టాక వారికి సమయం కేటాయించాలని బ్రేక్ ఇచ్చారు. రీఎంట్రీ ఇద్దామని అనుకున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ రాగా, ఆ షోకి వెళ్లాను. అయితే ఆ తర్వాత నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. అయినే నేను వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చాను. దానికి బూతులతో నన్ను దారుణంగా తిట్టేవారు. ఆ సమయంలో మా ఆయన షోకి వెళ్లకుండా ఉండాల్సింది అని అన్నారు. ఇక నేను ఏ వీడియో పెట్టిన దాని కింద బూతులు తిడుతూ కామెంట్స్ చేసేవారు.
యాంకర్‌గా ఎంతో మంది ముందు భయపడకుండా మాట్లాడిన నేను ట్రోల్స్ తర్వాత మాట రాలేదు. ఏం చేశానని నన్ను ఇలా తిడుతున్నారు అని అనిపించేది. ట్రోల్స్ వలన డిప్రెషన్‌కి వెళ్లాను. దాని నుండి బయటకు రావడానికి 4 నెలలు పట్టింది. ఇక తెలిసిన వాళ్లు కూడా నన్ను నెగెటివ్‌గా చూశారు. బయటకి వెళ్లాలంటే భయం వేసేది. అదే సమయంలో కరోనా రావడం, మా ఆయన బిజినెస్ ఆగడం, నాన్న బెడ్ మీద నుంచి పడి ఆ తర్వాత కోమాలోకి వెళ్లడం జరిగింది. ఇక హాస్పిటల్ బెడ్ మీదే నాన్న చనిపోయారు. మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. కాకపోతే ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు బాగున్నారు అని తెలిపింది. అయితే నాకు తెలిసిన వాళ్లే, బంధువులే నన్ను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేవాళ్లు. ఇలా పలు కారణాల వలన గ్యాప్ తీసుకున్నా. త్వరలోనే మళ్లీ బిజీ అవుతా అని తను 7 ఏళ్ల బాధలు వీడియోలో క్లియర్‌గా చెప్పుకొచ్చింది.