Anchor Ravi | ఈ మధ్య సెలబ్రిటీలు మతపరమైన చిక్కుల్లో పడుతున్న విషయం తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార నుంచి మొదలుకొని తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరకు అందరు ఎదోక విషయంలో మతపరమైన చిక్కుల్లో పడి క్షమాపణలు చెప్పిన వారే ఉన్నారు. అయితే తాజాగా యాంకర్ రవి (Anchor Ravi), సుడిగాలి సుధీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక టీవీ షోలో భాగంగా వారు చేసిన ఒక స్కిట్ వలన హిందువుల మనోభవాలు దెబ్బతిన్నయంటూ కొందరు మత పెద్దలు వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో దిగొచ్చిన యాంకర్ రవి వారికి క్షమాపణలు తెలిపాడు.
ఒక షోలో భాగంగా.. సుడిగాలి సుధీర్‌ని రవి పట్టుకుని నంది విగ్రహం నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడని చెప్పగా.. నాకు మాత్రం అమ్మాయి కనిపిస్తుందంటాడు సుధీర్. అయితే ఈ సన్నివేశం చిరంజీవి బావగారు బాగున్నారా చిత్రంలోనిది. ఇందులో నుంచి తీసుకుని రిపీట్ చేశాడు సుధీర్. అయితే ఈ స్కిట్‌పై పలు హిందు సంఘాలు భగ్గుమన్నాయి. మీ స్కిట్ హిందువులను కించపరిచేలా ఉందని.. దేవుల్లతో మీ స్కిట్లు ఏంటంటూ యాంకర్ రవితో పాటు సుధీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొందరు హిందూ ఆర్గనైజేషన్‌కి చెందిన వ్యక్తులు అయితే రవికి కాల్ చేసి మరి తిట్టారు. ఇక స్కిట్‌పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో యూట్యూబ్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశారు.
తాజాగా ఈ వివాదంపై యాంకర్ రవి క్షమాపణలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బావగారు బాగున్నారా? మూవీలోని ఆ సీన్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. ఈ మూవీ వచ్చినప్పుడు చిరంజీవి చేసింది తప్పు అని చెప్పి ఉంటే మళ్లీ ఇలా చేసి ఉండేవాళ్లం కాదు. చిరంజీవి గారికి మేం అభిమానులం. ఆయన సినిమాల్లో ఏం చేస్తే బయట మేం కూడా అదే అనుసరిస్తాం. అయినా మేము ఏ దేవుడినీ కించపరచలేదు. పైగా నందీశ్వరుడిని స్టేజీపైకి తెచ్చినప్పుడు అందరం షూలు కింద విడిచేసి ఈ స్కిట్ చేశాం అంటూ రవి తెలిపాడు. అలాగే మీ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ వీడియోను యూట్యూబ్‌లో నుంచి తీసేశాం. మా వలన ఎవరైన భాదపడితే క్షమాపణలు కోరుతున్నామంటూ రవి చెప్పుకోచ్చాడు.
Anchor Ravi’s Phone Call Recording with Hindu Association Goes Viral :
“#Chiranjeevi gari ‘Bava garu Bagunnara’ cinema vachinappude meeru react ayyunte, ee roju memu aa skit chesunde vallam kaadu. Nenu Bharateeyudni… Allah ni pujisthanu, Jesus ni pujisthanu… kaani eppudu ye… pic.twitter.com/DX1LxPDI19
— Whynot Cinemas (@whynotcinemass_) April 11, 2025
వివాదంలో సుడిగాలి సుధీర్ ..
నంది కొమ్ముల మధ్య నుంచి రంభ దర్శనం అంటూ స్కిట్..
ఆగ్రహం వ్యక్తం చెస్తున్న నెటిజెన్స్..#Sudigalisudheer #Rambha pic.twitter.com/9OVzflRMDp
— SZN (@Suzenbabu) April 9, 2025