Rashmi Gautham | నేనేమైనా చట్టవ్యతిరేక పనులు చేశానా?.. నెటిజన్‌పై ఫైర్ అయిన యాంకర్ రష్మి
Rashmi Gautham | టాలీవుడ్ నటి రష్మి గౌతమ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు.
Rashmi Gautham | టాలీవుడ్ నటి రష్మి గౌతమ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో బిగ్ స్క్రీన్‌పై అప్పుడప్పుడు మెరుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇదిలావుంటే రష్మి (Rashmi) తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ఒక పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్ రిప్లయ్ ఇస్తూ.. కాషాయపు రంగు చీర కట్టి.. అన్నీ చెడ్డ పనులు చేస్తున్నావు. అంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మికి మండిపోయినట్టుంది. ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ గట్టిగా కౌంటర్లు వేసింది.
‘‘నేనేమైనా బిల్లులు కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టానా? లేదా నా తల్లిదండ్రుల్ని రోడ్డున వదిలేశానా? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా?.. ట్యాక్సులు కట్టలేదా?.. నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు, అకృత్యాలు చేశానా? ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా? మీ దృష్టిలో అసభ్యకరమైన పనులంటే ఏమిటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు ఎక్కువగా వింటున్నా. పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు.. నా వరకు దేవుడి అందరి వాడు. సనాతన ధర్మంలోని మంచి విషయం అదే అంటూ రష్మి గౌతమ్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
Have I not paid my bills or not taken responsibility of my family
Have I left my parents on the roads to fend for themselves
Have I not paid my taxes ?
Am I doing any illegal activities
Have I been charged for anything
What exactly is LANGA PANILU
I have been seeing these… https://t.co/Y0k5kv1AbQ— rashmi gautam (@rashmigautam27) January 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

