Roshan Meka | హీరో శ్రీకాంత్ (Actor Srikanth) తనయడు రోషన్(Roshan Meka) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రం నుంచి కథానాయికను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan) కథానాయికగా నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. చంద్రలేఖ పాత్రలో అనస్వర నటించబోతుండగా.. కొత్త పోస్టర్ను విడుదల చేసింది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతుండగా.. ఇందులో రోషన్ ఫుట్బాల్ ఆటగాడిగా కనిపించబోతున్నాడు.
Wishing our beautiful ‘CHANDRAKALA’ #AnaswaraRajan a very happy birthday ✨
Can’t wait for the audience to fall in love with your magic on screen.– Team #Champion ⚽️#Roshan @PradeepAdvaitam @MickeyJMeyer @AshwiniDuttCh @SwapnaCinema @AnandiArtsOffl @zeestudiossouth pic.twitter.com/0leSHj5LjP
— Swapna Cinema (@SwapnaCinema) September 8, 2025