 
                                                            Anasuya | టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తరువాత యాంకర్‌గా మారి ‘జబర్ధస్త్’ షో ద్వారా ప్రజాదరణ పొందారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి, ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘కథనం’, ‘విమానం’, ‘పుష్ప’, ‘కిలాడి’ వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. 39 ఏళ్ల వయస్సులోనూ యంగ్ హీరోయిన్లకు పోటీగా గ్లామర్, గ్రేస్ కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనసూయ, సోషల్ మీడియాలో కూడా మిలియన్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు. తరచుగా తన స్టైలిష్ ఫోటోషూట్లు, వ్యక్తిగత అనుభవాలతో ఫ్యాన్స్‌ను కనెక్ట్ అవుతూ ఉంటారు.
తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో కజిన్ సిస్టర్ పెళ్లి వేడుకలో చేసిన సందడికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలలో అనసూయ చాలా జాలీగా కనిపించింది. తమ బంధువులతో కలిసి చేసిన సందడి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ కాగా, వాటికి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల అనసూయకి సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదు.దాంతో మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తుంది. యాంకర్‌గా కాకుండా జడ్జ్ రోల్లో సందడి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే, అనసూయ ఇటీవల తన మేనేజర్ మహేంద్ర గురించి చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కెరీర్ ప్రారంభం నుంచి తనతో కలిసి పని చేసిన మేనేజర్ మహేంద్ర ఇకపై తనతో పని చేయబోరని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా అనసూయ భావోద్వేగంగా స్పందిస్తూ ఇలా రాసింది . నాకు మేనేజర్‌గా ఎంతోకాలం పనిచేసిన మిస్టర్ మహేంద్ర ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు. ఈ వృత్తిపరమైన ప్రయాణం నాకు చాలానే నేర్పింది. ఇన్నేళ్ల అనుబంధంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. తన సమయం, కృషి, అంకితభావం చూపిన మహేంద్రకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అనసూయ, కొత్త మేనేజర్ కోసం వెతుకుతున్నట్లు కూడా వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు సంప్రదించేందుకు ఓ మెయిల్ ఐడీని ఆమె పోస్ట్‌లో షేర్ చేశారు.
 
                            