Anasuya | యాంకర్ అనసూయ అంటే కేవలం ఒక టీవీ యాంకర్ కాదు, ఆమె ఒక ట్రెండ్ సెట్టర్. బుల్లితెరపై తన మాటలతో, అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘జబర్దస్త్’ షోతో ఆమె సంపాదించిన క్రేజ్ అపారం. ఆ తర్వాత సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అనసూయ కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు, నటనలోనూ తన ప్రతిభను చాటుకుంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ‘క్షణం’, ‘పుష్ప’, ‘యాత్ర’ వంటి సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి, ఒక నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతుంటుంది. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ.
అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది. 39 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అనసూయ ప్రత్యేక పూజలు కూడా చేసింది. అనసూయకు భక్తి కూడా ఎక్కువ. . శ్రావణ మాసం మొదలైన సందర్భంగా చక్కగా పూజలు చేశారు.శశాంక్, అనసూయ దంపతులు శ్రావణ శుక్రవారం సందర్భంగా తమ స్వగృహంలో వరలక్ష్మీ వ్రతం చేశారు. అలానే రాఖీ వేడుకలకి సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేస్తూ.. ‘ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాహ్… సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిన్డ్ దుబ్క్డా భగ్ భవేత్’ అని ఈ ఫోటోలకు అనసూయ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.