నటిగా, యాంకర్‌గా సత్తా చాటుతున్న అనసూయ రీసెంట్గా పుష్ప చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. అయితే ఇటీవల అనసూయ తండ్రి సుదర్శన్ రావు కస్బా (డిసెంబర్ 5న) క్యాన్సర్ కారణంగా కన్నుమూయగా, ఆయన మృతి అనసూయ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ స్పందిస్తూ.. తన తండ్రికి సంబంధించిన పలు ఫొటోలు షేర్ చేస్తూ భావోద్వేగ భరిత పోస్ట్ పెట్టింది.
నా అత్యంత అందమైన పాపాజీ … నేను నా చిత్తశుద్ధితో మిమ్మల్ని ఎప్పుడూ గర్వపడేలా చేస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నా. మీరిచ్చిన ఈ జీవితానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావడం లేదు. దాన్ని చెప్పేందుకు మాటలు లేవు. తినే భోజనం నుంచి వ్యాయామాల వరకు మేం ఏం చేయాలో, మా ఛాయిస్‌లను బోధించినందుకు మాటలు లేవు. మనం గడిపిన ఆనంద సమయాలన్నింటినీ నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.
మీరు అర్థరాత్రి ఇచ్చే సర్ప్రైజ్ ట్రీట్‌లన్నింటినీ ఎప్పటికీ మర్చిపోలేను. అదంతా మాపై మీకున్న అపరిమితమైన ప్రేమ. మన సొంత నిబంధనలపై జీవితాన్ని గడిపేలా నేర్పించారు. ధైర్యంగా, బలంగా ఉండమని నేర్పించారు. మీరు ఎప్పటికీ జనాలకు టైగర్ దర్శన్ పెహెల్వాన్‌గానే నిలిచి ఉంటారు. మీరు మా నాన్నగా ఎంతో గొప్పగా చేసి, మమ్మల్ని ఎంతో ఆదర్శంగా పెంచారని మనం ఏం చెప్పినా ఈ ప్రపంచం అలా ఉంటుందని నేను ఊహించను. మనం ఎలా ఉంటామో మీరు మమ్మల్ని వదిలి వెళ్లకముందే చెప్పాను. ఇప్పుడు మనం అందరితో కలిసి ఉంటాం. మీరు వెళ్లిపోయినా ఎప్పటికీ మాతోనే ఉంటారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలి నాన్నా` అని తెలిపింది అనసూయ.
https://www.instagram.com/p/CXfsE5lLZ-c/?utm_source=ig_web_copy_link