Anasuya | అందాల ముద్దుగుమ్మ అనసూయ నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. ఈ అమ్మడు ఏం చేసిన అది వార్తనే. ఈ మధ్య అనసూయ కొత్తింటి గృహప్రవేశం చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఇంటిలో అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వెంటనే కుమారుడి ఉపనయనం వేడుక కూడా జరిపింది. అందుకు సంబంధించిన ఫొటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ వేడుకలు పూర్తైన వెంటనే ఫ్యామిలీతో కలిసి శ్రీలంకలో వాలింది. సమ్మర్ వెకేషన్లో భాగంగా శ్రీలంకకి వెళ్లిన అనసూయ..అక్కడ తమ ఎంజాయ్మెంట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తుంది.
తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. ఈ క్రమంలో అనసూయ అభిమానులకు బికినీ ట్రీట్ ఇచ్చింది. తన ఇద్దరు కుమారులు, భర్తతో ఆహ్లదంగా గడుపుతూ స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది. గతంలో కూడా అనసూయ పలు సందర్భాలలో బికినీ ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చింది. మరోవైపు స్విమ్మింగ్ పూల్ లో అనసూయ తన భర్తతో రొమాంటిక్ గా కనిపించింది. ఇక అనసూయ మరి కొద్ది రోజుల పాటు శ్రీలంకలోనే ఉండనుండగా, ఇంకెన్ని ట్రీట్స్ ఇస్తుందో అని ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు.
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ..ఆ తర్వాత యాంకర్‌గా అలరించింది. ఇక నటిగాను అదరగొడుతుంది. ఈ బ్యూటీ. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటిగా తనకు ఎదురులేదనిపించింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానాన్ని సొంతం చేసుకొని మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ సంపాదించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.