Anasuya Bharadwaj | టాలీవుడ్లో యాంకర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ ఇప్పుడు కోలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ‘పుష్ప 2’, ‘రజాకార్’ వంటి సినిమాలతో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన అనసూయ తాజాగా తమిళ సినిమాలో గ్లామరస్ లుక్‌లో కనువిందు చేశారు. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ‘ఊల్ఫ్’ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమాలో ఆమెతో పాటు లక్ష్మీరాయ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వినూ వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఎప్పటి నుంచో ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే, ఎవరూ ఊహించని విధంగా మేకర్స్ తాజాగా ‘సాసా సాసా’ అంటూ సాగే ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ పాటలో అనసూయ గ్లామరస్ అవతారంలో కనిపిస్తూ ప్రభుదేవాతో రొమాంటిక్‌గా డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పుష్ప 2’లో మాస్ లుక్‌తో అదరగొట్టిన తర్వాత ఇప్పుడు పూర్తిగా భిన్నమైన స్టైలిష్ అవతారంలో కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ ‘ఊల్ఫ్’ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ సాంగ్‌తో మూవీపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అనసూయ అభిమానులు ఇప్పుడు ఆమె తమిళ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రంగస్థలం చిత్రంతో వెండితెరకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ అనసూయ తన నటనతో ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలో అనసూయ నటనకి ఫిదా కాని వారు లేరు. ఈ సినిమా తర్వాత అనసూయకి చాలా అవకాశాలు వచ్చాయి. ఇటీవల తెలుగులో కాస్త అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు ఈ అమ్మడు తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.