పురాతన దేవాలయాల్లోని భూగర్భ నేలమాలిగల్లో దాచివుంచిన కోటానుకోట్ల సంపద పరిరక్షణార్థం తాంత్రిక శక్తిని నిక్షిప్తం చేసి, ఏర్పాటు చేసే నాగబంధం నేపథ్యంలో రూపొందుతోన్న సాహసోపేత ఆధ్యాత్మిక ఇతివృత్తం ‘నాగబంధం’. విరాట్‌కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి నిర్మాత.
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది. ప్రమోషన్లో భాగంగా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న అనసూయ భరద్వాజ్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలమని, ఒక ఎపిక్ అడ్వెంచర్‌గా ఈ సినిమా ఉంటుందని నిర్మాత తెలిపారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పానిండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాలో నభా నటేష్, అశ్వర్య మీనన్ కథానాయికలు. జగపతిబాబు, రిషబ్ సహానీ, జయప్రకాష్, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్.ఎస్, సంగీతం: అభే, సమర్పణ: లక్ష్మి ఐరా అండ్ దేవాన్ష్, నిర్మాణం: NIK స్టూడియోస్ అండ్ అభిషేక్ పిక్చర్స్.