అందం, అభినయంతో బుల్లితెరపై.. వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఓవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తుంది. చివరిగా ‘థ్యాంక్యూ బ్రదర్’ అనే సినిమాలో గర్భిణిగా కనిపించి మెప్పించిన న అనసూయ ప్రస్తుతం ‘పుష్ప’ తో పాటు ‘ఆచార్య’, ‘ఖిలాడీ’, ‘రంగమార్తాండ’, ‘ఫ్లాష్ బ్యాక్’ సినిమాల్లో నటిస్తుంది.
పుష్ప చిత్రంలో అనసూయ దాక్షాయణి అనే పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమె పాత్ర చాలా నెగెటివిటీతో ఉంటుందని తెలుస్తుంది. రంగమ్మత్త పాత్రకు పూర్తి భిన్నంగా దాక్షాయణి పాత్రని సుకుమార్ డిసైడ్ చేశాడని అంటున్నారు. తాజాగా దాక్షాయణి పాత్రకు సంబంధించి లుక్ విడుదల చేయగా, ఈ లుక్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అనసూయ కెరీర్లో దాక్షాయణి పాత్ర గుర్తుండిపోయేదిగా ఉంటుందని అంటున్నారు.
రామ్ చరణ్ ప్రధానపాత్రలో వచ్చిన రంగస్థలం సినిమాలోని అనసూయ తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మూవీల్లోని కీలక పాత్రల కోసం ఆఫర్లు అనసూయకు ముందు క్యూ కట్టాయి.ఈ క్రమంలోనే అనసూయకు పుష్ప ఆఫర్ దక్కగా, ఈ సినిమాతో మరోసారి అదరగొట్టనుందని అంటున్నారు.
She is arrogance and pride personified!
— Mythri Movie Makers (@MythriOfficial) November 10, 2021
Introducing @anusuyakhasba as #Dakshayani.. #PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/ER87UhxXLZ