Ananya Panday | బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే తన బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని ఆధ్యాత్మిక పర్యటనలో భాగమయ్యింది. ఇందులో భాగంగా గుజరాత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకను సందర్శించారు. ద్వారకాధీశ ఆలయాన్ని దర్శించుకున్న ఆమె, శ్రీకృష్ణుడి ఆశీస్సులు తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ పర్యటనలో అనన్య పూర్తి సాంప్రదాయబద్ధంగా పసుపు రంగు చుడీదార్ ధరించి, మెడలో తులసి మాల, నుదుటన తిలకంతో ఎంతో పద్ధతిగా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ద్వారకలో గడిపిన సమయం తనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని, భగవంతుని సన్నిధిలో ఉండటం సంతోషంగా ఉందంటూ ఆమె తన పోస్ట్‌కు ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. సాధారణంగా గ్లామరస్ రోల్స్‌లో కనిపించే అనన్య, ఇలా భక్తిభావంతో ఆధ్యాత్మిక బాటలో కనిపించడంతో నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆలయ గోపురం ముందు దిగిన ఫోటోలు, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.
#AnanyaPanday shares stills from her recent visit to Dwarka. 😍#Celebs pic.twitter.com/aC9c68x7zx
— Filmfare (@filmfare) March 24, 2026