బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తన హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. పూల్‌లో చిల్ అవుతూ ఫోటోలు దిగి వాటిని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది ఈ అమ్మడు. ఆరెంజ్ కలర్ బికినీ వేసుకొని.. బీచ్ ఒడ్డున అనన్య దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఫ్లెమింగో ఆకారంలో ఉన్న బెలూన్ మీద కూర్చొని ఉన్న అనన్య.. ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్‌లో ఉందని ఆ ఫోటోలను చూస్తేనే తెలుస్తుంది. తను మాల్దీవులకు హాలీడేకు వెళ్లినప్పటి నుంచి సోషల్ మీడియాలో వరుసగా.. తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది.
ఇక.. తన సినిమాల విషయానికి వస్తే.. అనన్య పాండే.. ఖో గయె హమ్ కహాన్ అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నట్టు వెల్లడించింది. అనన్య పాండే.. విజయ్ దేవరకొండతో తెలుగు సినిమా లైగర్‌లోనూ నటిస్తోంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.