‘షాదీ’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించిన అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ సైతం అందుకుంది. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మల్లేశం’ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఈ మూవీలో అనన్య సహజమైన నటనతో అదరగొట్టింది. తద్వారా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రంతో పాపులర్ అయింది అనన్య నాగళ్ల. ఇందులో తెలంగాణకి చెందిన అమ్మాయిగా, ఇన్నోసెంట్ పాత్రలో మెప్పించింది. తెలంగాణ యాసలోనూ మాట్లాడి కట్టిపడేసింది. ఈసినిమాలో అనన్యది చిన్న రోలే అయినా తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపుని తెచ్చుకుంది. సోషల్ మీడియాతో తన పాపులారిటీని మరింత పెంచుకుంటుంది.
ఓ సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అనన్య అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు అందరి కంట్లో పడింది. ఊహించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్ల మాదిరిగా అనన్యకి కూడా సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ ఉండటం విశేషం. తాజాగా తన ట్రైనర్‌తో కలిసి చేసిన యోగసనాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరచింది. అనన్య టాలెంట్ చూసి అందరు షాకవుతన్నారు. మంచి భవిష్యత్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CW-sWwJp3KV/?utm_source=ig_web_copy_link