‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సునీల్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కవితాత్మక ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం టీజర్‌ను విడుదల చేశారు. ‘అతను పదాలను ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పువ్వుల్లా ఉంటాయి. అదే కసితో రాస్తే పిన్ తీసేసిన గ్రెనేడ్‌లా ఉంటాయి’ అనే వాయిస్ ఓవర్‌తో ఊటీ నేపథ్యంలో మొదలైన టీజర్ పొయెటిక్ ఫీల్‌తో ఆకట్టుకుంది.
వర్షం, మంచు జడిలో తడిసిన ఊటీ ప్రాకృతిక సౌందర్యం తాలూకు విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ‘ప్రేమ చేరుకోవడానికి ఓ గమ్యం కాదు. మనం చేయాల్సిన ప్రయాణం’ అంటూ హార్ట్‌టచింగ్ మాటలతో టీజర్‌ను ముగించిన తీరు కథపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ వర్ష రుతువులో హృదయాల్ని స్పృశించే ప్రేమకథా చిత్రమని, చక్కటి కవితాత్మక భావాలతో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి.