Napoleon Returns | నా నీడ పోయిందంటూ అప్పట్లో నెపోలియన్ చిత్రంతో ఆకట్టుకున్న డైరెక్టర్ ఆనంద్ రవి ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు. గేదె దెయ్యం అంటూ మరో వైవిధ్యాన్ని తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన చిత్ర టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం విడుదల చేశారు. ప్రముఖ రైటర్ ఆనంద్ రవి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు నెపోలియన్ రిటర్న్ అనే టైటటిల్ను ఖరారు చేశారు. ఇందులో దివి మరో కీలక పాత్ర పోషించింది. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్త ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘నెపోలియన్’ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఆనంద్ రవి ఇద్దరు స్నేహితులతో కలిసి కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. అక్కడ ఓ గెదే ఆత్మగా మారి ఇబ్బంది పెడుతుందని ఇన్స్పెక్టర్ రఘుబాబుతో చెబుతాడు. ఆ తర్వాత ఆనంద్ రవి విజువల్స్‌తో పాటు తాను ఏం కంప్లయింట్ చేయాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన విజువల్స్‌ను వేగంగా చూపించారు. దీంతో పోలీస్ రఘుబాబు సహా అందూ ఆ గేదె ఆత్మ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇంట్లో కనిపించే 9 నెలల చిన్నారి పుర్రెను చూపించడంతో సరికొత్త హారర్ సస్పెన్స్ మూవీ భావన కలుగుతుంది. గ్లింప్స్ చివరలో ఓ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ రవిని చూస్తూ.. ఇంతకుముందు నువ్వే కదా నీడ పోయిందని కంప్లయింట్ ఇచ్చావని అడుగుతాడు. ఇలా నెపోలియన్ సినిమా రిఫరెన్స్‌ను అక్కడ చూపించారు.
ఈ గ్లింప్స్‌లో విజువల్స్ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆనంద్ రవి, దివి వాద్త్యా, ఆటో రాంప్రసాద్, రఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్రవణ్ రాఘవేంద్ర, యాంకర్ రవి, రవి వర్మ, మీసాల లక్ష్మణ్ తదితరులు ఈ సినిమాలో నటించారు. భోగేంద్ర గుప్తా నిర్మిస్తోన్న ఈ సినిమాకు కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ, సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని అందిస్తున్నారు.