‘బేబీ’ చిత్రంలో జంటగా నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. వీరిద్దరు కలిసి మరోమారు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 90’s వెబ్‌సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. బుధవారం అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. 90’s సిరీస్‌లో చిన్నపిల్లవాడు ఆదిత్య పెరిగి పెద్దయ్యాక అతనికి ఓ అందమైన ప్రేమకథ ఉంటే ఎలా ఉంటుందనే ఊహ నుంచే ఈ కథ పుట్టినట్లు అనౌన్స్మెంట్ వీడియోలో చూపించారు. ‘
మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్‌క్లాస్ బాయ్ లవ్‌స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ.. కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్‌స్టోరీ’ అంటూ వీడియోలో ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అజీమ్ మొహహ్మద్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: ఆదిత్య హాసన్.