‘ట్రైలర్ చాలా బావుంది. నాకు కె-డ్రామాలంటే ఇష్టం. ట్రైలర్ చూస్తుంటే కె-డ్రామా వైబ్‌లో ఉంది. సినిమా కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నా. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి ఆనంద్కి గొప్ప పేరు తీసుకురావాలి. వైష్ణవి అద్భుతంగా చేసిందని అంతా అంటున్నారు. ఆదిత్యహాసన్ చూడ్డానికి ఇన్నోసెంట్‌గా ఉన్నాడు. ట్రైలర్ చూస్తుంటే నెక్ట్స్ లెవల్. సినిమా ఇంతకు మించి ఉంటుందని ఆశిస్తున్నా. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్. 10న ప్రీమియర్స్ ఉంటాయి. తప్పకుండా చూడండి’ అని అగ్ర కథానాయిక రష్మిక మందన్నా అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యువతరం ప్రేమకథ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్యహాసన్ దర్శకుడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘విజయ్ లాంటి అన్నయ్య, రష్మిక లాంటి వదిన దొరకడం నాఅదృష్టం. ఇక ‘ఎపిక్’ విషయానికొస్తే.. ఈ సినిమా చూస్తే మన జీవితాల్లో ఎపిక్ మూమెంట్స్ గుర్తొస్తాయి.
ఇది నిజంగా ప్రత్యేకమైన సినిమా. దర్శకుడు ఆదిత్య హాసన్ లోతుగా అధ్యయనం చేసి ఈ సినిమా చేశారు. వైష్ణవి కళ్లతోనే అద్భుతమైన భావాలు పలికించింది. ఇది వెరీ ఎమోషనల్ ఫిల్మ్. కచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది’ అని నమ్మకంగా చెప్పారు. ఇంకా కథానాయిక వైష్ణవి చైతన్య, చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్, నటుడు శివాజీ కూడా మాట్లాడారు. అతిథులుగా విచ్చేసిన దర్శకులు శివ నిర్వాణ, శైలేష్ కొలను, వినోద్ అనంతోజు, కల్యాణ్ శంకర్, సాయిమార్తాండ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.