ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘హైవే’ (ఏ నెర్వ్ వ్రెకింగ్ రైడ్స్టోరీ) గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీఐశ్వర్యలక్ష్మీ మూవీస్ పతాకంపై వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి తుంగతుర్తి శాసన సభ్యుడు గాదరి కిషోర్ క్లాప్‌నివ్వగా, సీనియర్ దర్శకుడు ఎం.వీరభద్రం కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సైకో క్రైమ్ థ్రిల్లర్ కథాంశమిది. రోడ్ జర్నీ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. పేరున్న నటీనటులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారు’ అని చెప్పారు. “చుట్టాలబ్బాయి’ తర్వాత మా సంస్థ నిర్మిస్తున్న ద్వితీయ చిత్రమిది. ఉన్నత సాంకేతిక విలువలతో భారీ వ్యయంతో తెరకెక్కిస్తాం. జూన్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం’ అని నిర్మాత తెలిపారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘తొలిసారి ఓ సీనియర్ దర్శకుడితో పనిచేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా గొప్ప చిత్రమవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె కింగ్, నిర్మాత: వెంకట్ తలారి, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: కె.వి.గుహన్.