యువహీరో ఆనంద్ దేవరకొండ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మంగళవారం ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని కొత్త చిత్రాల పోస్టర్స్‌ను విడుదల చేశారు. ‘గం గం..గణేశా’ పేరుతో తెరకెక్కిస్తున్న చిత్రానికి ఉదయ్‌శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ సినిమా కొత్త పోస్టర్లో సరికొత్త లుక్స్‌తో కనిపిస్తున్నారు ఆనంద్ దేవరకొండ. యాక్షన్ అంశాలు కలబోసిన చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఇక ‘హైవే’ చిత్రాన్ని సైకో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. కె.వి.గుహన్ దర్శకుడు. వెంకట్ తలారి నిర్మాత. ఈ సినిమా కొత్త పోస్టర్ కూడా విడుదలైంది. ‘ఆనంద్ దేవరకొండను వినూత్న కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది’ అని దర్శకుడు తెలిపారు.