Anaganaga OTT | టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం ‘అనగనగా’ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ సరసన కాజల్ చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా మే 15, 2025 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే, ఈ చిత్రం స్కూల్ నేపథ్యంలో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సుమంత్ ‘వ్యాస్’ అనే ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ, పిల్లలకు చదువును సులభంగా అర్థమయ్యేలా చెప్పే విధానం వంటి అంశాలను ఈ చిత్రం స్పృశించనుందని సమాచారం. కృషి ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని భావిస్తున్నారు.
Anaganaga – A heartfelt emotional story of love, life & learning.
Streaming from May 15 in 4K Dolby 5.1 – only on @etvwin@isumanth @rakeshreddy1224 @pavan_pappula @arvindmule_pd @ashwinrajasheka @Sri_Avasarala @chvenkatesh78@krishient @Asunnysanjay
@ThisisNitin1111 @i_taNmai… pic.twitter.com/YXOxMLwSaZ— ETV Win (@etvwin) May 3, 2025