Naveen Polishetty |టాలీవుడ్లో సంక్రాంతి సందడి మాములుగా లేదు. ఆ వేడుకల మధ్య నవీన్ పొలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా దర్శకుడు మారి తెరకెక్కించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ “అనగనగా ఒక రాజు” ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. రిలీజ్‌కు ముందు కొన్ని అవాంతరాలు ఎదురైనా, మేకర్స్ మాత్రం సినిమాపై బజ్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు బుకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజు నుంచే ఆశాజనకంగా మొదలయ్యాయి. ముఖ్యంగా రెండో రోజు బుకింగ్స్‌లో భారీ జంప్ నమోదు కావడం ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంటోంది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు టికెట్ అమ్మకాలు గణనీయంగా పెరగడం వల్ల, సినిమా సంక్రాంతి రేసులో బలమైన పోటీదారిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
గత 24 గంటల్లోనే ఈ చిత్రంకి సంబంధించి సుమారు లక్ష 80 వేలకుపైగా టికెట్లు విక్రయం కావడం విశేషం. ఇది మునుపటి రోజుతో పోలిస్తే చాలా ఎక్కువ సంఖ్య కావడంతో, ఆడియెన్స్‌లో సినిమాపై ఉన్న ఆసక్తి ఎంతలా పెరిగిందో అర్థమవుతోంది. నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తాడన్న నమ్మకం ఫ్యాన్స్‌లో బలంగా ఉంది. అలాగే మీనాక్షి చౌదరి పాత్ర కూడా కథలో కీలకంగా ఉండడంతో ఆమె నటనపై అంచనాలు పెరిగాయి.సాంకేతికంగా కూడా “అనగనగా ఒక రాజు” బలంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కథను మరింత ఎంగేజింగ్‌గా మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంపై ట్రేడ్‌లోనూ మంచి నమ్మకం ఉంది. మొత్తానికి, బుకింగ్స్ ట్రెండ్ చూస్తే “అనగనగా ఒక రాజు” సంక్రాంతి సీజన్లో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిలీజ్ తర్వాత టాక్ అనుకూలంగా వస్తే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత పెద్ద నంబర్స్ సెట్ చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.