నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. దీపావళి సందర్భంగా స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ ప్రోమో ఆకట్టుకుంది. ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన హాస్యాన్ని అందించే చిత్రమిదని, నవీన్ పొలిశెట్టి తనదైన కామెడీతో నవ్వుల్ని పంచుతారని, ఈ సినిమాలోని తొలిగీతాన్ని త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: మారి.