Tribanadhari Barbarik | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik). సత్యరాజ్ లీడ్ రోల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో వశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి సింగిల్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ పాడిన నీవల్లే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయగా మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి అనగా అనగా కథలా పాటను లాంచ్ చేశారు. సత్యరాజ్, చిన్నారి మధ్య సాగుతున్న ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని విజువల్స్ చెబుతున్నాయి.
మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమా నుంచి సత్యరాజ్ పాత్ర లుక్‌తోపాటు టైటిల్ గ్లింప్స్‌ను షేర్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. బార్బారిక్ ప్రపంచంలో సత్యరాజ్ పాత్ర కీలకంగా సాగనున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది.
గ్లింప్స్‌లో ఎవరు తాతా ఇతను..? అని చిన్నారి అడుగగా.. ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా తాతా..? హహ కాదమ్మా.. అంటూ సాగే డైలాగ్స్‌తో మాధవా.. వెయ్యేనుగుల బలశాలి భీముడికి మనవడిని. ఘటోత్కచుడుకు కుమారుడిని అంటూ బార్బరిక్ పాత్రను ఎలివేట్ చేసే ఇంట్రడక్షన్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్ కథ ఆధారంగా వస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది మారుతి టీం.
Team #Barbarik launched their second single, #AnagaAnagaKathala, in a grand celebration at TKR College
#AnagaAnagaKathala Song is OUT NOW : https://t.co/dnzT1Bx6Lc
Composed by 🎼: @BandInfusion
Sung by 🎤: @KarthikSingerA @DirectorMaruthi Team… pic.twitter.com/GUcxVwvn7x
— Vamsi Kaka (@vamsikaka) April 3, 2025
Jailer 2 | జైలర్2 క్రేజీ అప్డేట్.. బాలయ్య, సూర్య మధ్య బీభత్సమైన సన్నివేశాలా?