మలయాళ సినీరంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక అక్కడి ఇండస్ట్రీని కుదిపివేస్తున్నది. మలయాళ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులతో పాటు పారితోషికాల్లో వివక్ష, షూటింగ్ లొకేషన్లలో కనీన సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేమ కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో .
ఆయనతో పాటు మొత్తం 17 మంది పాలక మండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో వారందరూ రాజీనామా చేసినట్లు తెలిసింది.
రెండు నెలల్లోగా కొత్త పాలక మండలిని ఎన్నుకుంటామని అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘అమ్మ’ సంఘంలో సభ్యులుగా ఉన్న దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముఖేష్, సూరజ్ వెంజారమూడులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.