ముంబై: పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్ నుంచి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తప్పుకున్నారు. పాన్ మసాలా యాడ్‌లో నటించడం లేదని, ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం ద్వారా వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేసినట్లు అమితాబ్ వెల్లడించారు. పాన్ మసాలా బ్రాండ్‌ను అడ్వర్టైజ్ చేయడం వల్ల అమితాబ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. యాక్టర్ నిర్ణయాన్ని ఆయన అభిమానులు తప్పుపట్టారు. దీంతో ఆయన తన బ్లాగ్ ద్వారా ఓ వివరణ ఇచ్చారు. పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్లతో తనకు ఎటువంటి సంబంధంలేదని ఆదివారం అమితాబ్ ఆఫీసు ఓ బ్లాగ్ పోస్టు ద్వారా క్లారిటీ ఇచ్చింది. పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్ సరోగేట్ అడ్వర్టైజింగ్ కిందకు వస్తుందని అమితాబ్‌కు తెలియదని, ఆ విషయం తెలుసుకున్నాక ఆయన తన ప్రమోషన్‌ను టర్మినేట్ చేశారని, ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం వల్ల వచ్చిన డబ్బును కూడా వెనక్కి ఇచ్చేసినట్లు బ్లాగ్ పోస్టులో తెలిపారు. పాన్ మసాలా లాంటి యాడ్స్‌ను ప్రమోట్ చేయరాదు అని నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరాడికేషన్ (ఎన్ఓటీఈ) అమితాబ్‌ను కోరింది. పొగాకు వ్యతిరేక ఉద్యమానికి బిగ్ బి సహకరించాలని నోట్ అధ్యక్షుడు డాక్టర్ శేఖర్ సాల్కర్ కోరారు.