‘కల్కి’ చిత్రంతో అశ్వత్థామ పాత్రలో మెప్పించారు బిగ్‌బి అమితాబ్‌బచ్చన్. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కింది. దాంతో సీక్వెల్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సీక్వెల్‌కు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం మే నెలలో అమితాబ్ బచ్చన్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు తెలిసింది.
ఇటీవలే కౌన్ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్‌ను పూర్తి చేసిన అమితాబ్ ఇక సినిమాలపై దృష్టి పెడుతున్నట్లు తెలిసింది. సీక్వెల్లో అమితాబ్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని, ఆయనపై కొన్ని కీలకమైన యాక్షన్ ఘట్టాలు కూడా ఉంటాయని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కర్ణుడి పాత్రలో ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్.. ఇద్దరు కలిసి డెవిల్ యాస్కిన్ (కమల్‌హాసన్)పై చేసే పోరాటం సీక్వెల్లో హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. జూన్ రెండోవారం వరకు అమితాబ్ సీక్వెల్ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.